ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - పాఠశాల విద్యా శాఖ జాతీయ విద్యా విధానం - 2020 అమలులో ఉన్నవి- అమలు కావాల్సినవి తెలుగులో పత్రాన్ని విడుదల చేసిన ఎ.పి విద్యాశాఖ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - పాఠశాల విద్యా శాఖ
జాతీయ విద్యా విధానం - 2020 విద్య అనేది మానవుని సామర్థ్యం పూర్తి స్థాయిలో పొందుటకు, అసమానతలు లేని సమ సమాజ స్థాపనకు, జాతీయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక మహోన్నత సాధనం. దేశంలో విద్యాభివృద్ధిని మార్గనిద్ధేశం చేసేందుకు జాతీయ విద్యా విధానం ఒక సమగ్ర చట్టం. మొదటి జాతీయ విద్యావిధానం 1968లోనూ, రెండవది 1986 లోనూ ప్రవేశపెట్టబడినాయి. మూడవదైన ప్రస్తుత జాతీయ విద్యావిధానం 2020, కేంద్ర కేబినట్ చే 29, జూలై, 2020 ఆమోదం పొందబడినది. జాతీయ విద్య ప్రణాళిక 2020లో పాఠశాల విద్యకు సంబంధించి 8 ముఖ్య విషయాలపై ఈ క్రింది సిఫార్సులు చేయబడినవి. 1. పూర్వ ప్రాథమిక విద్య (0200) ౮41004 ౧౫౫౭ & 96462600) సిఫార్సులు పిల్లలలో 85% మించి మెదడు సమగ్ర అభివృద్ధి 6 సం॥॥ లోపు జరుగుతుంది. కాబట్టి కే 2030 నాటికి నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య పాఠశాల సంసిద్ధతగా 1వ తరగతిలోపే పిల్లలందరికి అందాలి. పూర్వ ప్రాథమిక విద్య ఈ క్రింది సంస్థల ద్వారా అందించబడుతుంది. (1) స్వతంత్ర అంగన్‌వాడీలు (2) ప్రాథమిక పాఠశాలలతో కలసి ఉన్న అంగన్‌వాడీలు (3) ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలోనే పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలల ఏర్పాటు (4) స్వతంత్ర పూర్వ ప్రాథమిక విద్యాసంస్థలు పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలలో నాణ్యత కలిగిన మౌలిక వసతులు, ఆట వస్తువులు, శిక్షణ పొందిన అంగన్‌వాడీ వర్మర్క్ / టీచర్లు. వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయి. ఇంటర్‌మీడియట్ ఆపై విద్యార్హత కల్గిన అంగన్‌వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య యందు 6 నెలల నర్జివికేట్ కోర్సు ఇవ్వబడుతుంది. తక్కువ విద్యార్హత కల్గిన వారికి వునాది విద్య - నంఖ్యా విద్య తదితర అవసరమైన విషయాలతో ఒక సం॥ డిప్లమా కోర్స్ నిర్వహించబడుతుంది. ప్రతి బాలుడు / బాలిక 1వ తరగతి కంటే ముందే సంసిద్ధత తరగతికి వెళ్ళాలి. గిరిజన ప్రాంతాలలో ఆ(శమ పాఠశాలలో దశల వారీగా వూర్వ (ప్రాథమిక విద్య ప్రారంభించబడుతుంది.
0 Response to "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - పాఠశాల విద్యా శాఖ జాతీయ విద్యా విధానం - 2020 అమలులో ఉన్నవి- అమలు కావాల్సినవి తెలుగులో పత్రాన్ని విడుదల చేసిన ఎ.పి విద్యాశాఖ..."
Post a Comment