నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభం: మంత్రి
డిస్‌పూర్: కరోనా వైరస్ లాక్‌డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వడంతో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలలను నవంబర్ 2వ తేది నుంచి తిరిగి తెరవాలని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 8, 10 మరియు 11 తరగతుల విద్యార్థులకు మంగళ, గురు, శనివారాల్లో తరగతులు ఉండగా, 6, 7,9 మరియు 12 సోమ, బుధ, శుక్రవారాల్లో తరగతులు ఉంటాయని అస్సాం ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.
మొదటి బ్యాచ్ తరగతులు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, రెండవ బ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పాఠశాలకు హాజరు కాకుండా ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడే విద్యార్థులకు ఆన్‌లైన్ విద్య విధానం కొనసాగుతుందని చెప్పారు. కళాశాలలలో మొదటి సెమిస్టర్‌లో సోమ, గురువారాల్లో తరగతులు ఉంటాయని, మూడవ సెమిస్టర్‌లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు

0 Response to "నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభం: మంత్రి"
Post a Comment