ఇద్దరు ఉద్యోగులపై ముందస్తు పదవీ విరమణ వేటు లోక్‌సభ స్పీకర్‌ అనూహ్య నిర్ణయం

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ అనువాద విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులతో లోక్‌సభ సచివాలయం ముందస్తు పదవీ విరమణ చేయించింది. 



వీరిద్దరూ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడంవల్లే ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. విధి నిర్వహణలో అసమర్థత, అవినీతి, అలక్ష్యం ప్రదర్శించే ఉద్యోగులను ఫండమెంటల్‌ రూల్‌ 56 కింద ముందస్తు పదవీ విరమణ చేయించడానికి వీలుకల్పిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ గత 28న ఆఫీస్‌మెమోరాండం జారీచేసిన రెండురోజులకే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 


లోక్‌సభ అనువాద విభాగంలో జాయింట్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ప్రణవ్‌కుమార్‌, కావేరి జైస్వాల్ల్‌తో ఆగస్టు 31న ముందస్తు పదవీ విరమణ చేయించినట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరికి నోటీసుకు బదులు మూడునెలల జీతభత్యాలు ఇచ్చి పంపించేశారు. ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా వీరు బయట ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలు నడుపుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చిట్‌ల నిర్వహణ,



 తోటి సిబ్బంది నుంచి డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడం లాంటి ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అనంతరమే ఈ చర్య తీసుకున్నట్లు లోక్‌సభ వర్గాలు పేర్కొన్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఇద్దరు ఉద్యోగులపై ముందస్తు పదవీ విరమణ వేటు లోక్‌సభ స్పీకర్‌ అనూహ్య నిర్ణయం"

Post a Comment