కరోన తాజా బులెటన్
అమరావతి: రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజూ వేలకు వేల
కేసులు బయటపడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో
ఏపీలో కొత్తగా 10,199 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో
కలిపి ఏపీలో 4 లక్షల 65 వేల 730కి కరోనా కేసులు చేరాయి. ఈ రోజు కరోనాతో 75
మంది చనిపోయారు. ఇప్పటివరకు ఏపీలో 4200కి కరోనా మరణాలు చేరాయి. ప్రస్తుతం
ఏపీలో లక్షా 3 వేల 701 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో 3 లక్షల 57 వేల 829
మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటి వరకు 39 లక్షల 5 వేల 775 కరోనా
టెస్ట్‌లు చేశారు
ఈ రోజు నమోదయిన మరణాలు... తూర్పుగోదావరి జిల్లాలో 10, చిత్తూరు 9, గుంటూరు
9, అనంతపురం జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. కృష్ణా 7, పశ్చిమగోదావరి
జిల్లాలో 7, నెల్లూరు 6, కడప 5, కర్నూలు జిల్లాలో నలుగురు మృతి చెందారు.
శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి
చెందారు. జాతీయ స్థాయిలో పాజిటివ్ కేసులతో పాటు పాజిటివిటీ రేటులోనూ ఏపీ
రెండో స్థానంలోకి వెళ్లింది. ఆయా రాష్ట్రాల్లో చేసిన పరీక్షలు, నమోదైన
కేసుల ఆధారంగా పాజిటవీటీ రేటును నిర్ధారిస్తారు
0 Response to "కరోన తాజా బులెటన్"
Post a Comment