సామాజిక దూరం కాదు.. సురక్షిత దూరం సభ్యులకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి సూచన
ఈనాడు,
దిల్లీ: ప్రస్తుత కొవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో విరివిగా వాడుతున్న
సామాజిక దూరం అన్న పదానికి బదులు సురక్షిత దూరం అని ఉపయోగిస్తే బాగుంటుందని
రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. మంగళవారం రాజ్యసభ శూన్య
గంటలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు శాంతనూసేన్ మాట్లాడుతూ వైరస్
సంక్రమించకుండా మనుషుల మధ్య దూరం పాటించాలన్న ఉద్దేశంతో ఉపయోగిస్తున్న
సామాజిక దూరం పదంతో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయని,
వైరస్‌ను సామాజిక
మచ్చగా భావించి రోగులను దూరం పెడుతున్నారని, దీనివల్ల వారి కుటుంబాలు
విపరీతమైన ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆ అభిప్రాయంతో
వెంకయ్యనాయుడు ఏకీభవించారు. ఇకమీదట దాన్ని సురక్షిత దూరం (సేఫ్
డిస్టెన్స్) అని ప్రయోగిస్తే బాగుంటుందని సూచించారు
0 Response to " సామాజిక దూరం కాదు.. సురక్షిత దూరం సభ్యులకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి సూచన"
Post a Comment