ఏపీలో స్కూల్స్ ప్రారంభంపై మంత్రి సురేష్ ఏమన్నారంటే

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్ పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. మంగళవారం నాడు అమరావతిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అన్‌లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. 



ఇప్పటికే విద్య కానుక సిద్దం చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇంజనీరింగ్ మోడల్ కరికులంను తీసుకొచ్చామని.. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్‌షిప్‌తో విద్య వ్యవస్థలో సంస్కరణలు చేశారన్నారు. జాతీయ విద్యా పాలసీ రాకముందే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై నిర్ణయం తీసుకున్నారని మంత్రి అన్నారు

అనేక సంస్కరణలు..!

కనీసం 10 నెలల ఇంటర్న్‌షిప్‌‌ తప్పని సరిగా అవసరం సిలబస్, క్రెడిట్, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంతో కరికులం సిద్ధం చేశాం. అనేక మంది నిపుణులతో కమిటీ ఆరు నెలలకు పైగా కసరత్తు చేశారు. మార్కెట్ అవసరానికి అనుగుణంగా సిలబస్ సిద్దం చేశారు. కేవలం డిగ్రీ తీసుకోవడం కాకుండా, కాలేజ్ నుంచి బయటకి రాగానే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యత లభిస్తుంది. ఏపీ నుండి విద్యార్థులు డిగ్రీ చేపడితే సత్తా ఉన్నవారు అని రాబోయే రోజుల్లో గుర్తింపు ఉంటుంది. విద్య రంగంలో అనేక సంస్కరణలకు సీఎం శ్రీకారం చుట్టారు. కరోనా అనంతరం కాలేజీలు, యునివర్సిటీల్లో అనేక మార్పులు వస్తాయి. కరోనా తర్వాత పరిస్థితులు అంచనా వేసి అనేక మార్గదర్శకాలు సిద్దం చేశాం’ అని మంత్రి సురేష్ వెల్లడించారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో స్కూల్స్ ప్రారంభంపై మంత్రి సురేష్ ఏమన్నారంటే"

Post a Comment