క్రెడిట్‌ కార్డు వినియోగదారులు చేయకూడని తప్పులు ఇవే

  • క్రెడిట్‌ కార్డులు అనేక ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ఎప్పుడు
  • కావాలంటే అప్పుడు ఇన్‌స్టంట్‌ క్రెడిట్‌, లోన్‌ ఫెసిలిటీతోపాటు క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లు, రివార్డు పాయింట్ల లాంటి పలు
  • ప్రయోజలను ఇవి అందజేస్తున్నాయి. కానీ క్రెడిట్‌ కార్డులను ఉపయోగించేవారు


కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అవి ఏమిటంటే..

  • క్రెడిట్‌ కార్డును పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) లేదా ఆన్‌లైన్‌లో ఉపయోగిస్తే 51 రోజుల వరకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. క్రెడిట్‌ కార్డు సాయంతో ఏటీఎం నుంచి కూడా డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే మాత్రం మీరు డబ్బులు విత్‌డ్రా చేసిన రోజు నుంచి వడ్డీ పడుతూనే ఉంటుంది.
  • క్రెడిట్‌ కార్డు బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించడం ఉత్తమం. ఒకవేళ బిల్లు మొత్తాన్ని తర్వాతి నెలలో కడదామని భావిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇలా చేయడం వల్ల ఫైనాన్స్‌ చార్జీలు, వడ్డీ లాంటివి పడతాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే వీలైనంత వరకు బిల్లులను పెండింగ్‌లో పెట్టకుండా ప్రతి నెలా చెల్లించాలి. ఒకవేళ మొత్తం బిల్లులో కొంచమే కట్టగలిగితే మిగిలిన మొత్తాన్ని తర్వాతి నెలలో పూర్తిగా చెల్లించండి.
  • క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించడం ఆలస్యమైతే ఏకంగా రూ.900 వరకు చార్జీలు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల సకాలంలో బిల్లును చెల్లించేందుకు ఆటో డెబిట్‌ ఫెసిలిటీని సెట్‌ చేసుకోండి. అప్పుడు మీరు మర్చిపోయినప్పటికీ బిల్లు చెల్లింపు ఆటోమ్యాటిక్‌గా జరిగిపోతుంది. దీంతో మీకు ఇబ్బందులు తప్పుతాయి.
  • క్రెడిట్‌ కార్డు బిల్లులను మీరు సకాలంలో చెల్లించలేకపోతే వడ్డీ బాదుడుతోపాటు మరో సదుపాయాన్ని కోల్పోతారు. దీంతో కొత్త ట్రాన్సాక్షన్లపై వడ్డీరహిత గడువు ఉండదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "క్రెడిట్‌ కార్డు వినియోగదారులు చేయకూడని తప్పులు ఇవే"

Post a Comment