ఇక రోజంతా.. ఓటీపీ ఆధారిత సేవలు

సెప్టెంబర్‌ 18 నుంచి అందుబాటులోకి

ముంబయి: ఓటీపీ ఆధారంగా రూ.10,000, అంతకుమించి నగదు ఉపసంహరణ చేసే పద్ధతిని రోజంతా (24 గంటలూ) అమలు చేయనున్నట్లు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. 



ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని కల్పించినప్పటి నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అమలవుతోంది. దీని ప్రకారం.. డెబిట్‌కార్డు కలిగినవారు ఏటీఎంకు వెళ్లి, రూ.10,000, అంతకు మించి ఉపసంహరించాలంటే, రిజిస్టర్‌ మొబైల్‌కు వచ్చే ఓటీపీ కూడా నమోదు చేయాల్సి ఉంది. అంటే డెబిట్‌ కార్డుతో పాటు బ్యాంకు వద్ద నమోదైన మొబైల్‌ కలిగి ఉంటేనే నగదు ఉపసంహరించే వీలుంటోంది


ఈ సదుపాయం సెప్టెంబర్‌ 18 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. ఖాతాదారులు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణల విషయంలో మరింత సురక్షితంగా ఉండేందుకు ఇది ఉపయోగ పడుతుందని ఎస్‌బీఐ డిజిటల్‌ బ్యాంకింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఎస్‌ శెట్టి పేర్కొన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇక రోజంతా.. ఓటీపీ ఆధారిత సేవలు"

Post a Comment