ఉద్యోగులకు పీఎఫ్‌ రక్ష

సంఘటిత రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతా ఉంటుంది. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొదుపు పథకం. ఎన్నో లాభాలున్న ఈ పథకం గురించి చాలా మందికి లోతైన అవగాహన ఉండదు. ఉద్యోగ భవిష్య నిధి చట్టం కింద రిజిస్టరయిన కంపెనీల ఉద్యోగులు మాత్రమే ఈపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ఈపీఎఫ్‌ ఖాతాదారులకు కేవలం పీఎఫ్‌ లభించడమే కాకుండా అనేక లాభాలున్నాయి. వాటిలో ముఖ్యమైన ఐదు ప్రయోజనాలు ఇవీ.


.

1. ఈపీఎఫ్‌ డిపాజిట్లపై మంచి రాబడులు వస్తాయి. ఉద్యోగి జమ చేసిన సొమ్ముకు వడ్డీతో కలిపి చెల్లిస్తారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఈపీఎఫ్‌ యాక్ట్‌ 1956 ప్రకారం ఏర్పడిన సంస్థ కాబట్టి దీనిలో పెట్టిన పెట్టుబడి అత్యంత సురక్షితంగా ఉంటుంది


ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ప్రతి సవంత్సరం మారుతుంది. ప్రస్తుతం ఈ రేటు 8.5 శాతంగా ఉన్నది.

2. ఈ పథకంలో పెట్టుబడులకు ఆదాయ పన్ను చట్టంలోని 80సీ సెక్షన్‌ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

3. ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత పెన్షన్‌ స్కీమ్‌ 1995 (ఈపీఎస్‌) కింద జీవితకాల పెన్షన్‌ లభిస్తుంది.

4. ఈపీఎఫ్‌ చందాదారుడు మరణిస్తే.. కుటుంబ బీమా పథకం 1976 (ఈడీఎల్‌ఐ) ద్వారా అతని కుటుంబం లబ్ధి పొందవచ్చు. ఈ పథకం కింద ఉద్యోగి చివరి నెలలో అందుకున్న వేతనానికి 20 రెట్ల మొత్తాన్ని అతని కుటుంబానికి అందజేస్తారు. గతంలో ఈ మొత్తం గరిష్ఠంగా రూ.6 లక్షల వరకు ఉండేది. కానీ ఇటీవల దీన్ని రూ.7 లక్షలకు పెంచారు.

5. కరోనా సంక్షోభం వల్ల ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో ఈపీఎఫ్‌ ఖాతాల నుంచి పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఇది చాలా సులభమైన ప్రక్రియ. ఆన్‌లైన్‌ ద్వారా నిధులను సులభంగా ఉపసంహరించుకోవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉద్యోగులకు పీఎఫ్‌ రక్ష"

Post a Comment