సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభం

అమరావతి: సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది. విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. 



రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టులకు ఆమోదం లభించనుంది. ప్రకాశం బ్యారేజీ దిగువున మరో రెండు బ్యారేజీల నిర్మాణంపై ముఖ్యంగా మంత్రి వర్గం చర్చించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో డివిజనల్ స్థాయిలో... డీడీవో పోస్టుల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది

వైఎస్ఆర్‌ ఆసరా పథకం అమలుపై మంత్రి మండలిలో చర్చ జరగనుంది. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు.. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం నిర్ణయం.. గోదావరి, కృష్ణా వరద బాధితులకు పరిహారం పంపిణీపై చర్చ జరగనుంది. ఏపీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధానికి కేంద్రానికి కేబినెట్‌ ప్రతిపాదనలు పంపనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభం"

Post a Comment