ఏడేళ్ల వయసులోనే పుస్తకం రాసిన అభిజిత
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 :
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అభిజిత ఏడేళ్ల వయసులోనే రచయిత్రిగా మారింది.
ఆలోచనలకు అక్షర రూపమిచ్చి.. ఆసక్తికి సాహితీ పరిమళం అద్ది.. చిట్టి చేతులతో
పద్యాలు, కథలు రాసి..
’హ్యాపీనెస్ ఆల్ ఎరౌండ్’శీర్షికన ఓ పుస్తకాన్ని
రచించింది. దాన్ని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ జూనియర్, ఇన్‌విన్సిబుల్
పబ్లిషర్స్ సంయుక్తంగా విడుదల చేశాయి. రచనా వ్యాసంగంతో అందరినీ
ఆశ్చర్యపరుస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. రాష్ట్ర కవి మైథిలీశరణ్
గుప్త్, సంత్‌కవి
సియారామ్‌శరణ్ గుప్త్‌ల ముని మనవరాలు. ఐదేళ్ల వయసులోనే
కథలు రాయడం మొదలుపెట్టిన అభిజితప్రస్తుతం.. రెండో తరగతి చదువుతోంది.
సాహితీపిపాస
కుటుంబంలో మూడోతరం రచయిత్రిగా బాల్యం నుంచే బాటలు వేసుకుంటోంది
0 Response to "ఏడేళ్ల వయసులోనే పుస్తకం రాసిన అభిజిత"
Post a Comment