మొబైల్‌ యాప్‌లో ఎంపీల సంతకం

దిల్లీ: కరోనా నేపథ్యంలో ఎంపీల సంతకాలకోసం పార్లమెంటు ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. సంతకం చేసే సమయంలో సాధారణ హాజరు నమోదు పుస్తకంపై చేతులుపెట్టే అవకాశం ఉండటంతో వైరస్‌ సంక్రమణ ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశంతో లోక్‌సభ సచివాలయం ఈ యాప్‌ను తయారుచేసింది. కేవలం పార్లమెంటు ప్రధాన భాగం(కోర్‌ ఏరియా)లో మాత్రమే పనిచేసేలా దీన్ని రూపొందించారు. సభ్యులు ఆ ప్రాంతంలో ఉంటేనే ఇందులో సంతకం చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా చుట్టుపక్కల ఎక్కడున్నా అది సాధ్యం కాదు. దీంతోపాటు సాధారణ హాజరు నమోదు పుస్తకం కూడా అందుబాటులో ఉంచుతున్నామని, సభ్యులు ఈ రెండింటిలో దేన్నైనా ఉపయోగించుకోవచ్చని లోక్‌సభ సచివాలయం శనివారం రాత్రి జారీచేసిన బులిటెన్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకోసం వేర్వేరుగా రూపొందించిన ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకొని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. మరోవైపు కొవిడ్‌ నేపథ్యంలో ఎంపీలకోసం ఈనెల 13, 14 తేదీల్లో రోజుకు గంటపాటు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేశారు



రాజ్యసభలో మీడియాకు అవకాశం
కొవిడ్‌ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు అవకాశం కల్పించడం సంక్లిష్టమైనప్పటికీ రాజ్యసభ సచివాలయం మేలైన పద్ధతి అనుసరించనుంది. సభ జరిగే 18 రోజుల్లో 120 మీడియా సంస్థలకూ రొటేషన్‌ పద్ధతిలో మూడురోజులకోసారి సభా కార్యకలాపాలను కవర్‌ చేసే అవకాశం ఇచ్చింది. ఎవరికి ఏ రోజు అన్నది లాటరీ పద్ధతి ద్వారా నిర్ణయిస్తుంది. ఈ విధానాన్ని మీడియా స్వాగతించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మొబైల్‌ యాప్‌లో ఎంపీల సంతకం"

Post a Comment