నేడు గురజాడ 158వ జయంతి
విజయనగరం రూరల్/విజయవాడ కల్చరల్, సెప్టెంబరు 20: నవయుగ వైతాళికుడు, సాహితీ రంగానికి దిక్సూచిలా నిలిచిన గురజాడ అప్పారావు 158వ జయంతిని సోమవారం అధికారికంగా నిర్వహించేందుకు విజయనగరం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్ హాజరుకానున్నారు.
గురజాడ ఫౌండేషన్ (అమెరికా) ఆధ్వర్యంలో గురజాడ వెంకట అప్పారావు 158వ జయంతి సందర్భంగా గురజాడ స్పూర్తి ఉత్సవం-2020 వెబినార్ నిర్వహిస్తున్నట్టు ఆయన మునిమనుమడు రవీంద్రుడు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
ఈ సదస్సుకు పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు, మండలి బుద్ధప్రసాద్, ఈమని శివనాగిరెడ్డి, గోళ్ల నారాయణరావు అతిథులుగా హాజరుకానున్నారు
0 Response to "నేడు గురజాడ 158వ జయంతి"
Post a Comment