జనగణన, ఎన్‌పీఆర్‌ ఈ ఏడాది లేనట్లే.



దిల్లీ: దేశంలో కరోనా కారణంగా వాయిదా పడిన మొదటి విడత జనగణన, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) ఈ ఏడాదిలో జరిగే సూచనలు కనిపించడం లేదు. కరోనా ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో ఏడాది ఆలస్యం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. జనగణన అనేది అంత అత్యవసరమైన ప్రక్రియేమీ కాదని, ఏడాది ఆలస్యమైనా వచ్చే నష్టమేమీ లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే, దీనిపై ఇప్పటికైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 2020లో జరిగే అవకాశమైతే లేదని అభిప్రాయపడ్డారు.



దేశవ్యాప్తంగా వాస్తవానికి ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరగాల్సి ఉంది.


కొవిడ్‌-19 కారణంగా వాయిదా పడింది. పదేళ్లకోమారు నిర్వహించే జనగణన ప్రక్రియ చేపట్టాలంటే పెద్ద ఎత్తున అధికారులు ప్రమేయం అవసరమని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడమంటే వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమేనని సదరు అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ప్రాథమ్య అంశాల్లో జనగణన, ఎన్‌పీఆర్‌ లేవని మరో అధికారి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నమోదు ప్రక్రియగా గుర్తింపు పొందిన జనగణన, ఎన్‌పీఆర్‌ నమోదు కార్యక్రమంలో సుమారు 30 లక్షల మంది అధికారులు భాగస్వాములు అవ్వాల్సి ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జనగణన, ఎన్‌పీఆర్‌ ఈ ఏడాది లేనట్లే."

Post a Comment