కోతపెట్టిన వేతనం చెల్లించాలి: బొప్పరాజు
అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి):
కరోనా విపత్తులో ప్రభుత్వ ఉద్యోగులకు కోతపెట్టిన మే, జూన్ వేతనాలను
తిరిగి చెల్లించాలని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ప్రభుత్వాన్ని కోరారు
. విధి నిర్వహణలో ఉంటూ కరోనా సోకి మృతిచెందిన ఉద్యోగుల
కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాగా,
ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌కు అక్టోబరులో ఎన్నికలు
నిర్వహించాలని కార్యవర్గంలో తీర్మానించారు.
ఎన్నికల అధికారిగా
పి.కృష్ణారావు, ఉపఎన్నికల అధికారిగా అంజిప్రసాదరావును నియమించారు.
0 Response to "కోతపెట్టిన వేతనం చెల్లించాలి: బొప్పరాజు"
Post a Comment