10,548 కొత్త కేసులు
రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. శుక్రవారం 62,024 మందికి పరీక్షలు నిర్వహించగా 10,548 మందికి కొవిడ్ నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌లు 4,14,164కు చేరాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ 82 మందిని కరోనా బలి తీసుకుంది. చిత్తూరులో 15మంది, నెల్లూరులో 11మంది, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది చొప్పున, అనంత, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, కృష్ణాజిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 3,976కు పెరిగాయి. కొవిడ్ మరణాల జాబితాలో చిత్తూరు జిల్లా టాప్‌లో నిలిచింది.
ఇప్పటి వరకూ ఆ జిల్లాలో 394మంది మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 56,930కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో మరో 1,572మందికి కరోనా సోకింది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణ, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్‌తో పాటు వారి కుటుంబాల్లో మరికొందరికి వైరస్ సోకింది. టీడీపీ అధినేత చంద్రబాబు వీరితో ఫోనులో మాట్లాడి, పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో మరో 1.096మందికి వ్యాధి నిర్ధారణయ్యింది. నెల్లూరులో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 1,538 కేసులు నమోదయ్యాయి
0 Response to "10,548 కొత్త కేసులు"
Post a Comment