కళ్లద్దాలపై కరోనాకు ఇలా చెక్‌!

న్యూఢిల్లీ, ఆగస్టు 30 : మీరు కళ్లద్దాలు వాడుతారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త!! వాటిపైనా తొమ్మిది రోజుల దాకా కరోనా వైరస్‌ మనగలదని గుర్తుంచుకోండి. 




ఆస్పత్రికి గానీ, మందుల దుకాణానికి గానీ వెళ్లొచ్చిన తర్వాత తప్పకుండా కళ్లద్దాన్ని శుభ్రం చేసుకోండి. అయితే అందుకోసం ఆల్కాహాల్‌తో కూడిన శానిటైజర్లు, అమోనియా, బ్లీచింగ్‌లతో కూడిన ద్రావణాలను వాడొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 



 పాత్రలు కడిగేందుకు వాడే సబ్బు నురగతో కళ్లద్దాలను శుభ్రం చేసి, పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుందని తెలిపారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడైతే అందుకోసం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ద్రావణాన్ని వాడొచ్చని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కళ్లద్దాలపై కరోనాకు ఇలా చెక్‌!"

Post a Comment