ఫోన్ చేస్తే ఇంటికే డబ్బులు... కొత్త సర్వీసులు అందుబాటులోకి

ముంబై : బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్ళాల్సిన అవసరం ఇక లేదు. ఫోన్ చేస్తే చాలు... నగదు నేరుగా ఇంటికే వచ్చేస్తుంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు పలు రకాల సర్వీసులను అందిస్తోన్న విషయం తెలిసిందే. బ్యాంక్ అకౌంట్ దగ్గరి నుంచి రుణాల వరకు పలు సేవలనందిస్తోంది. ఇప్పుడు మరో కొత్త సర్వీసును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.



కరోనా వైరస్ మహమ్మరి శరవేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో... బ్యాంక్ డోర్‌స్టె్ప్ ఎస్‌బీఐ ఏటీఎం సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో బ్యాంక్ కస్టమర్లు ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తీసుకోవలసిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటి వద్దకే డబ్బులు వచ్చేస్తాయి. బ్యాంకు జనరల్ మేనేజర్(లక్నో సర్కిల్) అజయ్ కుమార్ తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ కొత్త సర్వీసుల గురించి వెల్లడించారు.అయితే ప్రస్తుతం ఈ సేవలు లక్నోలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.


ఇక్కడ విజయవంతమైతే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే ఈ కొత్త సేవల వల్ల కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్‌కు మరింత బెనిఫిట్ లభిస్తుంది. ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఇటీవల కస్టమ్లకు గుడ్ న్యూస్ అందించిన విషయం తెలిసిందే. మినిమమ్ బ్యాలెన్స్, ఎస్ఎంఎస్ చార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "ఫోన్ చేస్తే ఇంటికే డబ్బులు... కొత్త సర్వీసులు అందుబాటులోకి"