ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఫెయిలైన వారు పాస్‌

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌–2020 పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారందరినీ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాసైనట్లుగా రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. వీరికి నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కోవిడ్‌–19 నేపథ్యంలో రద్దు చేసి ‘ఆల్‌పాస్‌’గా ప్రభుత్వం 

ప్రకటించినందున అభ్యర్థులు ఫెయిలైన సబ్జెక్టులన్నిటికీ పాస్‌ మార్కులు వేస్తూ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాస్‌ చేసినట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. అలాగే ఫస్టియర్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ కోసం 2021 మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షల్లో రాసుకోవాలన్నారు. సెకండియర్‌ పరీక్షలతో పాటు ఫస్టియర్‌ సబ్జెక్టులకు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఫెయిలైన వారు పాస్‌"

Post a Comment