పాఠశాల, సర్వీసు* *పాయింట్లతో బదిలీలు
- తర్వాత వారానికి ఒక్కరోజే
- బయోమెట్రిక్ హాజరు మినహాయింపు
- ప్రైమరీ స్కూళ్లలో 30 మందికి ఒకరు
- 60 మంది దాటితే ముగ్గురు టీచర్లు
- ప్రాథమికోన్నత పాఠశాలలకు యథాతథం
- కనీసం రెండేళ్ల సర్వీసుతో బదిలీలకు ఓకే
- ఉపాధ్యాయ సంఘాలు, అధికారుల భేటీలో నిర్ణయాలు
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ పాఠశాలల ఉపాధ్యాయులకు ఒకింత ఊరట కలిగించే నిర్ణయాలు వెలువడ్డాయి. కరోనా విస్తృతి నేపథ్యంలోనూ వివిధ పనులపై పాఠశాలలకు రావాలని ఆదేశించడం, రేషనలైజేషన్ ప్రక్రియకు సన్నాహాలు చేయడం వంటివాటిపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉపాధ్యాయ సంఘాలు, పాఠశాల విద్యా శాఖ అధికారులు ఆయా సమస్యలపై చర్చించి, సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారు. టీచర్ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలు ప్రధాన అజెండాగా జరిగిన చర్చల్లో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ వి.చినవీరభద్రుడు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
టీచర్ల హాజరుపై నిర్ణయాలు ఇవీ..
ఈ నెల 7 వరకు టీచర్లు ప్రతిరోజు పాఠశాలలకు హాజరై పెండింగ్ కార్యక్రమాలు పూర్తి చేయాలి. తర్వాత ప్రాథమిక పాఠశాలల టీచర్లు ప్రతి మంగళవారం, ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లు బుధవారం, ఉన్నత పాఠశాలల టీచర్లు శుక్రవారం పాఠశాలలకు వచ్చి విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలి.
ఆయా రోజుల్లో బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఉంటుంది.
కట్టడి ప్రాంతాల్లో ఉన్న టీచర్లు స్కూళ్లకు వెళ్లనవసరం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికీ మినహాయింపు.
హేతుబద్ధీకరణకు సంబంధించి..
రాష్ట్రంలోని ఏ టీచర్ పోస్తూ రద్దు కాదు. ప్రాథమిక పాఠశాలల్లో 1:30 ప్రకారమే టీచర్ పోస్టులు ఉంటాయి.
40 మంది విద్యార్థుల వరకు ఇద్దరు, 60 మంది దాటితే మూడో పోస్టుకు అవకాశం. మిగిలిన పోస్టులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేస్తారు.
ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతంలో మాదిరిగానే పోస్టులను హేతుబద్ధీకరిస్తారు.
డీఈవో పూల్‌లో ఉన్న పండిట్లను ఈ స్కూళ్లలో భర్తీ చేస్తారు.
280 కన్నా ఎక్కువగా విద్యార్థులు ఉన్న చోట 2వ పోస్టు మంజూరు.
హైస్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లు లేనిచోట యూపీ స్కూలు నుంచి పంపిస్తారు.
ఉన్నత పాఠశాలల్లో 240 మంది విద్యార్థుల ప్రతిపాదనపై ఉపాధ్యాయ సంఘాల నేతలు విభేదించారు. 180 మంది విద్యార్థులు చాలని పట్టుబట్టారు. దీనిపై పరిశీలిస్తామని అధికారులు చెప్పారు. ఇంగ్లీషు మీడియం ఉంటే నాలుగు పోస్టులు కొనసాగుతాయి.
బదిలీలు ఇలా..
బదిలీలకు కనీస సర్వీసు రెండేళ్లు ఉండాలి. ఒక ప్రదేశంలో గరిష్ఠంగా ఎనిమిదేళ్లు పూర్తి కావాలి. హెడ్మాస్టర్లకు ఐదేళ్ల సర్వీసు పూర్తి కావాలి. మోడల్ స్కూలు, కేజీబీవీల్లోనూ బదిలీలు చేపడతారు.
పాఠశాలల కేటగిరీ పాయింట్లు
సర్వీ్‌సకి 0.25 పాయింట్ నుంచి 1 పాయింట్‌గా మార్పునకు అంగీకారం. స్పౌజ్‌కి 5 పాయింట్లు కేటాయిస్తారు.
కేటగిరీ-1కి 1 పాయింట్.. కేటగిరీ-2కి 2 పాయింట్లు.. కేటగిరీ-3కి 3 పాయింట్లు. కేటగిరీ-4కి 5 పాయింట్లు కేటాయిస్తారు.
సర్వీస్ పాయింట్లు.. స్టేషన్ పాయింట్ల ఆధారంగా బదిలీలు చేపడతారు
0 Response to "పాఠశాల, సర్వీసు* *పాయింట్లతో బదిలీలు"
Post a Comment