దేశ ప్రజలకు శుభవార్త.... అన్ లాక్ 3.0లో వాటికి అనుమతివ్వనున్న కేంద్రం...?


దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అన్ లాక్ 1.0, అన్ లాక్ 2.0 సడలింపుల వల్ల దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 49,000కు అటూఇటుగా నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో అన్ లాక్ 2.0 ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3.0 సడలింపుల గురించి కసరత్తు చేస్తోంది. 

ఇప్పటికే జనం గుమికూడే ప్రాంతాలు మినహా మిగిలిన వాటికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. అన్ లాక్ 3.0 సడలింపుల్లో కేంద్రం పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలకు అనుమతులు ఇవ్వనప్పటికీ సినిమా హాళ్లు, జిమ్‌లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించనుందని... భౌతిక దూరం వంటి కఠిన నిబంధనలతో కూడిన నిర్ధిష్ట మార్గదర్శకాలతో కేంద్రం అనుమతులివ్వనుందని తెలుస్తోంది.

 

. . 

కేంద్రం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసులు, వైరస్ తీవ్రత ఆధారంగా సొంతంగా మార్గదర్శకాలను జారీచేయవచ్చని చెప్పనుందని.... స్కూళ్లు, మెట్రో రైలు సర్వీసుల మూసివేత వంటి కొన్ని నియంత్రణలు అన్‌లాక్‌ 3లోనూ కొనసాగుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మానవ వనరుల మంత్రిత్వ శాఖ పాఠశాలల పునఃప్రారంభం గురించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల విద్యా శాఖ కార్యదర్శులతో చర్చించింది. ఐతే హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ తల్లిదండ్రులు పాఠశాలలు తెరవడానికి అంత సానుకూలంగా లేరని చెప్పారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "దేశ ప్రజలకు శుభవార్త.... అన్ లాక్ 3.0లో వాటికి అనుమతివ్వనున్న కేంద్రం...?"

Post a Comment