జూలై 15 న డి.ఇ.వో కార్యాలయాల ముందు నిరసనలు
రాష్ట్రంలోని బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులంతా ఉపాధ్యాయ బదిలీల షెడ్యూలు కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం
సిఫార్సు బదిలీలు చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) తీవ్రంగా ఖండించింది.
జూలై 15 నుండి బదిలీలు జరుపుతామని జూన్ 3 వ తేదీన గౌరవ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రకటించారని జూలై 15వ
తారీఖు వచ్చేస్తున్నా కనీసం షెడ్యూలు కూడా విడుదల చేయలేదని, మరో వైపు దొడ్డి దారి బదిలీలు చేస్తున్నారని మరిన్ని బదిలీలు చేసే
అవకాశం ఉందని ఇదే జరిగితే కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచి నట్టేనని వెంటనే అక్రమ బదిలీలు రద్దుచేయాలని ఫ్యాప్టో డిమాండ్
చేసింది.
జీవో నెంబర్: 342 ద్వారా 56,57 ఉపాధ్యాయులు, ఉద్యోగులు తదుపరి పదోన్నతి కోసం విద్యార్హతలు పొందడానికి వేతనంతో కూడిన
స్టడీలీవు కల్పించబడిందని, ఆర్ధిక శాఖ జారీ చేసిన మెమో మేరకు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి మెమో నెంబర్: 820399 జారీ చేశారని
ఆ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి విద్యార్హతల కోసం జీత నష్టపు సెలవు లో వెళ్ళాల్సి ఉంటుందని, ఇది దళిత, గిరిజన హక్కులను
కాలరాయడమేనన్నారు. సదరు మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా నిరసన తెలుపుతామన్నారు.
అక్రమ బదిలీలు రద్దు కొరకు, జీవో నెంబర్ : 342 కొనసాగింపు కొరకు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ( ఫ్యాప్టో ) రాష్ట్రంలోని అన్ని జిల్లాల
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల ముందు ది 15/07/2020 నిరసన కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించింది.
డిమాండ్లు :
1) ప్రభుత్వ అక్రమ బదిలీలు రద్దు చేయాలి - బదిలీల షెడ్యూలు వెంటనే విడుదల చేయాలి.
2) జీవో నెంబర్ : 342 ను కొనసాగించాలి. మెమో నెంబర్ : 820339 ను రద్దు చేయాలి.
0 Response to "జూలై 15 న డి.ఇ.వో కార్యాలయాల ముందు నిరసనలు"
Post a Comment