ఏపీలో కరోనా: లాక్‌ డౌన్‌ ముందు - తర్వాత

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకీ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.


 తాజాగా శనివారం ఏకంగా 491 కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8452కి చేరింది. లాక్‌డౌన్‌ విధించడానికి ముందు రాష్ట్రంలో కేవలం ఎనిమిది కేసులు మాత్రమే ఉండగా.. 



దేశంలో ఇప్పటివరకు విధించిన లాక్‌డౌన్‌లు, అన్‌లాక్‌ సమయాల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏపీ ప్రభుత్వం ఓ గ్రాఫ్‌ను విడుదల చేసింది

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రానికి చెందివారు 6620 మంది కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 1506 మంది. ఇక విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారిలో 326 మంది కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 101కి చేరింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,111గా ఉంది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,240 మంది చికిత్స పొందుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఏపీలో కరోనా: లాక్‌ డౌన్‌ ముందు - తర్వాత"

Post a Comment