ఇసుక బుకింగ్స్‌కు కొత్త సాఫ్ట్‌వేర్‌

ఇసుక బుకింగ్స్‌కు కొత్త సాఫ్ట్‌వేర్‌  అమరావతి: ఇసుక బుకింగ్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కొత్త సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పిస్తూ ఏపీఎండీసీ అధికారులు కొత్త పోర్టల్‌ను తయారు చేశారు.


 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల శాండ్‌ సేల్‌ పోర్టల్‌ అనే పేరుతో రూపొందించిన దీని ద్వారా సాధారణ వినియోగదారులు ఇసుక బుకింగ్స్‌ చేసుకోవచ్చు. సొంత అవసరాలకు ఇసుక కావాల్సిన వారు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి డిజిటల్‌ అసిస్టెంట్‌ను కలిసి వివరాలు ఇస్తే వారే ఇసుక బుక్‌ చేస్తారు.


 ఏ స్టాక్‌ యార్జు నుంచి ఇసుక ఎక్కడికి సరఫరా చేయాలి? ఎంత ఇసుక కావాలి? అనే సమాచారం ఇవ్వడంతోపాటు ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఇసుక ధర, రవాణా చార్జీల మొత్తం కూడా అక్కడే చెల్లించాల్సి ఉంటుంది. గ్రామ/వార్డు సచివాలయాల డిజిటల్‌ అసిస్పె స్టెంట్స్‌ *! అనే వెబ్‌పోర్టల్‌ లోకి వెళ్లి వినియోగదారులకు ఇసుక బుక్‌ చేయాల్సి ఉంటుందని ఏపీఎండీసీ అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు సమాచారం పంపింది. ఆ ప్రస్తుతం (గత ఏడాది కొత్త ఇసుకవిధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి) అందుబాటులో ఉన్న ఏపీ శాండ్‌ వెబ్‌ పోర్టల్‌లోకి వెళ్లి కూడా వినియోగదారులు నేరుగా ఇసుక బుక్‌చేసుకోవచ్చు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇసుక బుకింగ్స్‌కు కొత్త సాఫ్ట్‌వేర్‌"

Post a Comment