సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేయాలి: తల్లిదండ్రులు

న్యూఢిల్లీ, జూన్‌ 14: సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ 10, 12వ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కొవిడ్‌-19 కేసులు రోజురోజుకూ పెరుగుతండటంతో పరీక్షల రద్దే సరైందని చెబుతున్నారు.

 ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాల మేరకు సగటు మార్కులను గణించి, విద్యార్థులను పాస్‌ చేయడం.. లేదా ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌ ఆధారంగా ప్రమోట్‌ చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ‘స్టూడెంట్స్‌లైవ్స్‌ మ్యాటర్‌’, ‘లైవ్స్‌ ఓవర్‌ ఎగ్జామ్స్‌’, ‘క్యాన్సిల్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్‌ మీడియాలో చేపట్టిన ఉద్యమం ఊపందుకుంది. కాగా..

 పరీక్షల రద్దుకు కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో నాలుగు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేయాలి: తల్లిదండ్రులు"

Post a Comment