ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ కాలేజీల పని వేళల్లో మార్పు.?
కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్ విద్యామండలి పలు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ప్రవేశాలన్నీ కూడా ఆన్‌లైన్ ద్వారానే జరపాలని.. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది. అలాగే కళాశాలల పని వేళలను కూడా మార్చనున్నారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3.30 వరకు క్లాసులు.. ఆ తర్వాత స్పోర్ట్స్, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం
ఇకపై కళాశాలల్లో ఒక్కో సెక్షన్‌కు 40 మంది విద్యార్ధులకు అనుమతిస్తూ..
మొత్తం అన్ని గ్రూపులు కలిపి గరిష్టంగా 9 సెక్షన్లు ఉండేలా చర్యలు తీసుకుంటారట. CBSE తరహాలో పరీక్షలు జరిపేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రంలో మార్పులు చేసి.. ప్రశ్నల సంఖ్యను పెంచి మార్కులను తగ్గిస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక ఎంసెట్, జేఈఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్‌కు శిక్షణ ఇచ్చే కళాశాలలు ప్రత్యేక అనుమతి తీసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. కాగా, జిల్లాకు ఒక కాలేజీని అత్యున్నత విద్యాసంస్థగా తీర్చిదిద్ది.. విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా ఆన్‌లైన్ క్లాసులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది
0 Response to "ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ కాలేజీల పని వేళల్లో మార్పు.?"
Post a Comment