జూలై 1 నుంచి తెలంగాణలో మోగనున్న బడిగంట.. ఆది, సోమవారం సెలవు, నో గేమ్స్
పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు:
* జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు.
* ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారు.
* ఒక తరగతి గదిలో 15 మంది పిల్లలకు మించి అనుమతించరు.
* జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్లాసులకు అనుమతించరు.
* ప్లే గ్రౌండ్‌లో ఆటలకు అనుమతించరు. భౌతిక దూరం తప్పనిసరి.
* 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించింది. అంటే, ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమే.
* ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారు.
* ప్రాథమిక పాఠశాలలో ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు.
* ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాల సిలబస్‌ను 70 శాతానికి తగ్గిస్తారు.
* మొత్తం పని దినాలను 150 రోజులకు తగ్గించింది ప్రభుత్వం.
* 8, 9, 10 తరగతుల విద్యార్థుల సంఖ్య 15 మందికి మించితే షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు. వీరికి ఆదివారం మాత్రమే సెలవు.
* పాఠశాల పని గంటల్లో ఒక గంటను తగ్గించారు.
* 8-10 తరగతులకు ప్రతి రోజూ క్లాసులు.
* ఉన్నత పాఠశాల విద్యార్థులు కౌమారదశలో ఉంటారు. వారికి వారంలో 5 రోజులు తరగతులు నిర్వహిస్తే సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు వ్యవసాయ, ఇతర పనుల్లో నిమగ్నమై పిల్లల క్షేమాన్ని అంతగా పట్టించుకోరు. అందుకే వీరికి వారంలో 6 రోజులు తరగతులుంటాయి.
* కరోనా కారణంగా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పాయింట్ల పెంపు.. ఒక్కో తరగతికి వేర్వేరుగా భోజనాన్ని అందజేసే విధానం.
మొత్తంగా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అన్నీ మారిపోయాయి. జీవితమే తలకిందులైంది. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో ముప్పుతప్పదని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను కట్టడి చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రతీ విషయంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా ఉండాలి. అందుకే స్కూల్స్ తిరిగి ప్రారంభించాక కొత్త కొత్త రూల్స్ అమలు కానున్నాయి
0 Response to "జూలై 1 నుంచి తెలంగాణలో మోగనున్న బడిగంట.. ఆది, సోమవారం సెలవు, నో గేమ్స్"
Post a Comment