ఆరోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి):
ఆరోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. నియామకాల్లో
భాగంగా వయోపరిమితిని పొడిగిస్తూ ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి
మెమో ఇచ్చారు. జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయో పరిమితిని 34నుంచి 42ఏళ్లకు
పొడిగించారు. కాగా, సివిల్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల
నియామకాల్లో ప్రభుత్వం వెయిటేజీ ప్రకటించింది. 104వాహనాల్లో విధులు నిర్వహించిన, సీఎం
ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసిన వారికి ఈ అవకాశం కల్పించారు. మూడేళ్ల సర్వీసు
పూర్తి చేసుకున్నవారికి 15 శాతం, గిరిజన ప్రాంతాల్లో పని చేసినవారికి
ఏడాదికి 3మార్కులు, రూరల్ ప్రాంతాల్లో వారికి 2, అర్బన్ ప్రాంతాల్లో
వారికి ఒక
మార్కు వెయిటేజీ ఇచ్చారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్
ఇండియాలో పీజీ/సూపర్ స్పెషాలిటీ పూర్తిచేసినవారికి అసిస్టెంట్ ప్రొఫెసర్
నియామకాల్లో 5మార్కుల వరకూ వెయిటేజీ ఇవ్వాలని మరో జీవో విడుదల చేశారు
0 Response to "ఆరోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ"
Post a Comment