ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం... కొత్త సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
అమరావతి : ఏపీఎస్సార్టీసీ మరో నిర్ణయం తీసుకుంది. మరికొన్ని ఏసీ
బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది.
విజయవాడ నుంచి ఇప్పటికే
విశాఖపట్నానికి ‘ఇంద్ర’ ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించగా, ప్రయాణికుల
నుంచి డిమాండ్ పెరగడంతో మరిన్ని ఏసీ సర్వీసులు నడపాలని భావిస్తోంది. ఏసీ
బస్సులను విశాఖరతోపాటు కడప, కర్నూలు, తిరుపతిలకు నడపాలని నిర్ణయించింది.
అలాగే బస్సు సర్వీసులను కూడా పెంచుతోంది. ఇక ఏసీ బస్సుల్లో దుప్పట్లు
ప్రయాణికులే తెచ్చుకోవాలి. అటెండరు కూడా ఉండడు. బస్సుల్లో ఏసీని కూడా ఓ
లిమిట్‌లో మాత్రమే ఉంచనున్నారు
ఇక వంద శాతం నగదురహిత లావాదేవీలు... ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్
విధానం(ఓపీఆర్‌ఎస్)లో టిక్కెట్లను జారీ చేస్తారు. బస్టాండ్‌లలో కరెంట్
బుకింగ్ అవకాశం కల్పించనున్నారు. డిమాండ్‌ను బట్టి ఆయా రూట్లలో
అప్పటికప్పుడు బస్సులను నడపనున్నారు
0 Response to "ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం... కొత్త సర్వీసులకు గ్రీన్ సిగ్నల్"
Post a Comment