డిజిటల్ లెర్నింగ్ కోసం యాప్: జగన్

అమరావతి: పిల్లలు నేర్చుకునే విధానం, వారు చూపిస్తున్న ప్రతిభపై.. నిరంతరం అధ్యయనం జరగాలని ఏపీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 



విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున.. జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని జగన్‌ ఆదేశించారు. 


మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. స్కూల్లో సదుపాయాలపై టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డిజిటల్ లెర్నింగ్ కోసం యాప్: జగన్"

Post a Comment