ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌

 ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నలిచ్చారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహించాలని ఆదేశించారు. టెన్త్‌ పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చూడాలని జగన్‌ సూచించారు.



అంతకు ముందు క్యాంపు ఆఫీసులో నాడు–నేడుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌"

Post a Comment