ట్రాయ్ కొత్త యాప్.. కేబుల్ టీవీ, డీటీహెచ్ వినియోగదారులకు శుభవార్తే
ఈ యాప్‌ను ఎలా వినియోగించాలో చెప్పింది. యాప్ ఓపెన్ చేశాక సదరు వినియోగదారుడు తమ కేబుల్ లేదా డీటీహెచ్ ఆపరేటర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వారి సబ్‌స్క్రిప్షన్ ఐడీ, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. వెంటనే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే.. కేబుల్ టీవీ, డీటీహెచ్ ఛానెల్ ప్యాక్స్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సబ్‌స్క్రిప్షన్‌కు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ఛానెళ్ల జాబితాలో మరిన్ని ఛానెల్స్ యాడ్ చేసుకోవచ్చు. కాగా, గతంలో కొత్త ధరల విధానాన్ని ఆవిష్కరించిన ట్రాయ్ పలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కొత్త విధానంతో ధరలు తగ్గలేదని, ఇంకా పెరిగాయని టీవీ యూజర్లు ఆరోపించారు. దీంతో ట్రాయ్ యాప్ దిశగా అడుగులు వేసింది
0 Response to "ట్రాయ్ కొత్త యాప్.. కేబుల్ టీవీ, డీటీహెచ్ వినియోగదారులకు శుభవార్తే"
Post a Comment