మీరు ఆన్లైన్లో కనిపించకుండానే వాట్సాప్ లో మెసేజెస్ పంపించడం ఇలా


వాట్సాప్ లో మీకు వచ్చిన మెసేజ్ లకు మీరు ఆన్లైన్లో ఉన్న విషయం తెలియకుండానే రిప్లై ఇవ్వాలంటే కొన్ని టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం. అన్నిటికంటే చాలా సులభమైన పద్ధతి ఇది. వాట్సాప్ లో మీరు రిప్లై టైప్ చేస్తున్న విషయం అవతలి వారికి చూపించబడకుండా ఉండాలంటే, మొట్టమొదట మీ ఫోన్లో ఇంటర్నెట్ కనెక్షన్ డిజేబుల్ చేయండి. ఆ తర్వాత ఎవరికైతే మీరు రిప్లై కంపోజ్ చేయాలో వారికి వాట్సాప్ లో రిప్లై ఇచ్చి అప్లికేషన్ క్లోజ్ చేయండి. ఆ తర్వాత ఇంటర్నెట్ ఎనేబుల్ చేస్తే వాట్సప్ అప్లికేషన్ సంబంధిత కాంటాక్ట్‌కి ఆటోమేటిక్ గా రిప్లై పంపిస్తుంది.
Android 7 ఆపరేటింగ్ సిస్టం, తర్వాత వెర్షన్స్ వాడుతున్నవారు ప్రత్యేకంగా వాట్స్అప్ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా notification ప్రదేశం నుండి ఛాటింగ్ చేసే అవకాశం ఉంటుంది



మీరు ఆన్లైన్లో ఉన్న విషయం, మీరు టైపింగ్ చేస్తున్న విషయం అవతలి వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే, వాట్సప్ అప్లికేషన్ ఓపెన్ చేసి టైప్ చేయడం కాకుండా, మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేరుగా నోటిఫికేషన్ ఏరియా నుండి రిప్లై కంపోజ చేయండి. దాంతో మీద ఆన్లైన్లో ఉన్న విషయం వారికి తెలియదు.
గూగుల్ ప్లే స్టోర్ లో Unseen అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాన్ని ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసి, ఇక మీదట వాట్సాప్ మెసేజ్ లను దీని ద్వారా చదవటం మరియు రిప్లై చేయడం చేస్తే మీరు ఆన్లైన్లో ఉన్న విషయం అవతల వారికి తెలియదు. అయితే ఈ అప్లికేషన్ వాడేటప్పుడు Group Chat లోకి వెళ్లాలంటే మాత్రం తప్పనిసరిగా వాట్సప్ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సిందే

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మీరు ఆన్లైన్లో కనిపించకుండానే వాట్సాప్ లో మెసేజెస్ పంపించడం ఇలా"

Post a Comment