అంతర్రాష్ట్ర సర్వీసులకు ఏపీ పచ్చజెండా

అమరావతి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏపీ నుంచి కర్ణాటక రాష్ట్రానికి ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి కర్ణాటకలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. 




మొదట పరిమిత సంఖ్యలో 168 బస్సులను నడపనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది

కర్ణాటకకు వెళ్లే బస్సులను 4 దశల్లో 500కు పెంచాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. 




రేపటినుంచి ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని.. apsrtconline.in ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవాలని సూచించింది. బస్సుల్లో భౌతికదూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్‌ తప్పనిసరిగా వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అంతర్రాష్ట్ర సర్వీసులకు ఏపీ పచ్చజెండా"

Post a Comment