సర్కారీ బడికి.. జై
రాష్ట్రంలో సరికొత్త ఒరవడి
ప్రభుత్వ స్కూళ్ల వైపు తల్లిదండ్రుల చూపు
పాఠశాల విద్యలో పెనుమార్పులు
‘నాడు–నేడు’ ద్వారా రూ.10 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇంగ్లిష్ మీడియం
పౌష్టిక విలువలతో ‘జగనన్న గోరుముద్ద’
జగనన్న విద్యా కానుకతో బుక్స్, నోట్స్, యూనిఫాం, షూస్, బ్యాగ్ తదితరాలు పంపిణీ
ప్రమాణాల పర్యవేక్షణకు నియంత్రణ కమిషన్ ఏర్పాటు
సర్కారీ స్కూళ్లకు ఆదరణ..
లక్ష్యాన్ని మించి పెరిగిన విద్యార్థుల సంఖ్య
ఒక్క ఏడాదిలో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి 2.5 లక్షల మంది చేరికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రభుత్వ పాఠశాలలకు.. ప్రైవేట్ స్కూళ్లకు ఉన్న ప్రధాన వ్యత్యాసం మౌలిక వసతులు, ఆంగ్లంలో బోధన. ఇప్పుడిక ఆ తేడా తొలగిపోవడం, అమ్మఒడి లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక ఆసరా అందిస్తుండటంతో సర్కారీ స్కూళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏడాది వ్యవధిలోనే దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం దీనికి నిదర్శనం. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో లక్ష్యాన్ని మించి చేరికలు నమోదవుతున్నాయి.
► ఒక దశలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోగా గతేడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకంతో ప్రైవేట్
స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు భారీగా పెరిగాయి. 2020–21
విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
► ప్రభుత్వ పాఠశాలల్లో రూ.పది వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి
బలోపేతం చేయడంతోపాటు తల్లిదండ్రుల మనోగతానికి అనుగుణంగా ఇంగ్లిష్ మీడియం
అందుబాటులోకి తెస్తుండటం ప్రభుత్వ స్కూళ్ల పట్ల ఆదరణకు ప్రధాన కారణం.
► రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలతో
విద్యా వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. సర్కార్
స్కూళ్లంటే చులకనగా చూసే ధృక్పథం నుంచి వాటిల్లో తమ పిల్లలను భరోసగా
చదివించేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా
బోధన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏడాదిలోనే పలు చర్యలు చేపట్టింది. నాణ్యతా
ప్రమాణాలను పాటిస్తూనే జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక లాంటి పథకాల
ద్వారా తోడ్పాటునందిస్తుండటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వ
స్కూళ్లను ఆదరిస్తున్నారు
శరవేగంగా స్కూళ్ల అభివృద్ధి పనులు..
– రాష్ట్రంలోని 44,512 ప్రభుత్వ స్కూళ్లలో రూ.10 వేల కోట్లతో మౌలిక
సదుపాయాలు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ‘మనబడి నాడు–నేడు’
పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తొలిదశ కింద 15,715 స్కూళ్లను
అభివృద్ధి చేసేందుకు రూ.3,832 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో
ఇప్పటికే రూ.3,333 కోట్ల నిధులు మంజూరు చేశారు.
– స్కూళ్లలో టాయిలెట్లు (రన్నింగ్ వాటర్‌తో), విద్యుత్తు, ఫ్యాన్లు,
ట్యూబ్‌లైట్లు, మంచినీరు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నీచర్, పెయింటింగ్,
బ్లాక్ బోర్డులు. ఇంగ్లీషు ల్యాబ్స్, ప్రహరీలు, మరమ్మతులు లాంటి 9 రకాల
సదుపాయాలను కల్పిస్తారు. అవసరమైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని
చేపట్టారు.
– తొలిదశలో మొత్తం 15,715 స్కూళ్లలో 1,18,477 పనులు చేపట్టాలని అంచనా వేయగా
ప్రభుత్వం ఇప్పటికే 1,18,308 పనులకు అన్ని అనుమతులు ఇవ్వడంతో శరవేగంగా
కొనసాగుతున్నాయి.
36,58,553 మందికి ‘గోరుముద్ద’
– ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా పిల్లలకు రుచి, శుచికరమైన పౌష్టికాహారాన్ని రోజుకో రకమైన మెనూతో ప్రభుత్వం అందిస్తోంది
0 Response to "సర్కారీ బడికి.. జై"
Post a Comment