రాష్ట్రంలో 394 క్లస్టర్లు రెద్‌జోన్‌లో 22 ప్రాంతాలు
రాష్ట్రంలో 394 క్లస్టర్లు
రెద్‌జోన్‌లో 22 ప్రాంతాలు
13జిల్లాల్లో 100 ఆరెంజ్ జోన్లు
నెల్లూరులో 57, కర్నూలు 53 క్లస్టర్లు
రాష్ట్రంలో కరోనాలో అదుపులోకి వచ్చే పరిస్తితి కనిపించడం లేదు. రోజూ పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. మంగళవారం కూడా 115 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకూ కేసులు నమోదు కాని ప్రాంతాల్లోనూ కరోనా ప్రభావం కని పిస్తోంది.
కొత్త కేసులతో పాటు కంటైన్‌మెంట్ క్లస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక ప్రాంతం గ్రీన్‌జోన్‌లోకి వస్తే, రెండు రెడ్‌జోన్‌లోకి వెళ్తున్నాయి. ప్రన్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 394 క్లస్టర్స్ ఉన్నాయి. వీటిలో 2 2రెడ్‌జోన్, 100 ఆరెంజ్ జోన్, 92 బ్లూ జోన్, 180 గ్రీన్‌జోన్‌లోకి వచ్చాయి.
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 55 ఉండగా, కర్నూలులో 53ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణాలో 43 ప్రాంతాలు క్లస్టర్ పరిధిలో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగిలిన జిల్లాల్లో 20కి పైగా ఉన్నాయి. ఒక ప్రాంతంలో కేసులు నమోదైన రోజు నుంచి 5 రోజుల వరకూ ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా పరిగణి స్తున్నారు.
ఆదే ప్రాంతాల్లో ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని అత్యధిక ప్రమాదకర ప్రాంతంగా ఆరోగ్యశాఖ పరిగణిస్తుంది. ఇలాంటి ప్రాంతాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 22వరకూ ఉన్నాయి. 5రోజుల తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాకపోతే 6వ రోజు నుంచి 14రోజుల వరకూ ఆ ప్రాంతం ఆరెంజ్ జోన్‌లో ఉంటుంది. 15వ రోజు నుంచి 28రోజుల పాటు ఆ ప్రాంతం మొత్తాన్ని బ్లూజోన్‌గా పరిగణిస్తారు. ఈలోగా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోతే గ్రీన్‌జోన్‌గా ప్రకటిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అత్య ధికంగా చిత్తూరులో 11 ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. అనంతపురంలో 4, ప్రకాశం, కడపలో 2, గుంటూరు, శ్రీకా కుళం, విశాఖలో ఒక్కో ప్రాంతం రెడ్‌జోన్‌లో ఉన్నాయి.
0 Response to "రాష్ట్రంలో 394 క్లస్టర్లు రెద్‌జోన్‌లో 22 ప్రాంతాలు"
Post a Comment