భారత్‌లో కరోనా..2 లక్షలు దాటిన కేసులు
దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. గత నాలుగురోజులుగా దేశంలో ప్రతిరోజూ రికార్డుస్థాయిలో 8వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తా
తాజాగాన్న ఒక్కరోజే 8909 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వైరస్ బయటపడిన అనంతరం 24గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో బుధవారం నాటికి దేశంలో కొవిడ్-19 బారినపడ్డ వారిసంఖ్య 2,07,615కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతిరోజు దాదాపు 200మరణాలు సంభవిస్తున్నాయి. గడచిన 24గంటల్లో కరోనా వైరస్‌తో 217మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు కొవిడ్ సోకి 5815మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,00,304 మంది కోలుకోగా మరో 1,01,497 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల రేటు దాదాపు 6శాతంగా ఉండగా
భారత్‌లో మాత్రం 2.8శాతంగా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. అంతేకాకుండా భారత్‌లో కొవిడ్ బారినపడి కోలుకుంటున్న వారి శాతం 48గా ఉండటం కూడా కొంత ఉపశమనం కలిగిస్తోంది.
అయితే, భారత్‌లో 100 నుంచి లక్ష కేసులు నమోదుకావడానికి 64రోజుల సమయం పట్టగా..లక్ష నుంచి 2 లక్షలకు చేరడానికి కేవలం 15రోజుల సమయం పట్టింది. మే 19న దేశంలో లక్ష కేసుల మార్కు దాటగా ప్రస్తుతం జూన్ 3నాటికి రెట్టింపు కావడం వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 64లక్షలమంది ఈ వైరస్ బారినపడగా..వీరిలో 3లక్షల 80వేల మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్-19 తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ 7 స్థానంలో కొనసాగుతోంది. దాదాపు 2లక్షల 33వేల కేసులతో ఇటలీ ఆరో స్థానంలో ఉండగా..లక్షా 84వేల కేసులతో జర్మనీ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. కొవిడ్ మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది
0 Response to "భారత్‌లో కరోనా..2 లక్షలు దాటిన కేసులు"
Post a Comment