రాగల 24 గంటల్లో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాయలసీమలో పలు ప్రాంతాల్లో, కోస్తాలోని గుంటూరు, ప్రకాశం, జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, అయితే మరో రెండురోజులు ఇదే వాతావరణం ఉంటుందని స్పష్టం చేసింది.
కాగా.. ఏపీలోని గుంటూరు, కృష్ణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ రాగల 24 గంటల్లో ఉరుములు, ఈదురు గాలులతో.. మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డితోపాటు మేడ్చల్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. యాదాద్రి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, గద్వాల జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
0 Response to "రాగల 24 గంటల్లో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు"
Post a Comment