230 వర్సిటీల్లో త్వరలో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు
న్యూఢిల్లీ, జూన్ 21: ఉన్నత విద్య మరింత ఎక్కువ మంది విద్యార్థులకు అందుబాటులోకి రాబోతోంది. త్వరలోనే 230 వర్సిటీలు ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులను అందించే అవకాశం ఏర్పడనుంది.
ఈమేరకు వర్సిటీల అర్హతకు సంబంధించిన ప్రమాణాల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది.
నాక్ 3.01, సీజీపీఏ (గ్రేడ్ ఏ)కు ఎగువన ఉన్న లేదా టాప్ 100 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఉన్న విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చే ప్రతిపాదనను యూజీసీ ఖరారు చేయనున్నట్టు సమాచారం. దీనివల్ల 230 వర్సిటీలకు అర్హత లభించవచ్చని తెలుస్తోంది
0 Response to "230 వర్సిటీల్లో త్వరలో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు"
Post a Comment