హోంఆంధ్రప్రదేశ్ టీటీడీ ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్పు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్
పేరును మార్చారు. ఈ మేరకు టీటీడీ బోర్డు ప్రకటన జారీ చేసింది.
స్వతంత్రంగా ఉన్న టీటీడీ వెబ్ సైట్‌ను ప్రభుత్వ సైట్‌కు అనుబందంగా మారుస్తున్నట్టు కీలక
ప్రకటన చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆర్జితసేవలు,
దర్శనం, బస, కల్యాణమండపాలు తదితర ఆన్‌లైన్ సేవలను బుక్
చేసుకోవడంతోపాటు ఈ-హుండీ,
ఈ-డొనేషన్స్ సౌకర్యం అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in
గా పేరు మార్చనున్నట్టు టీటీడీ ప్రకటించింది. మార్చిన పేరు గల వెబ్‌సైట్
రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.
అయితే, కొత్త సైట్
అమల్లోకి రానున్న కొన్ని గంటల ముందు ఈ ప్రకటన విడుదల చేయడంపై పలువురు
విస్మయం వ్యక్తం చేస్తున్నారు

0 Response to " హోంఆంధ్రప్రదేశ్ టీటీడీ ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్పు"
Post a Comment