పాన్ కార్డును పోగొట్టుకున్నారా..?
పాన్ కార్డు... ఆర్ధిక లావాదేవీల కోసం అత్యంత అవసరం. ప్రస్తుతం బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా ఇది తప్పనిసరి.
అలన్తి పాన్ కార్డును పోగొట్టుకున్నామని ఆందోళన చెందుతున్నారా? అలాంటి అవసరమే లేదు. ఆన్లైన్ లో మనం డూప్లికేట్ కార్డు కోసం అప్లై చేయవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ముందుగా www.tin-nsdl.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Services ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అందులో PAN ఆప్షన్ ఎంచుకోండి.
Reprint of PAN Card పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి
మీ పాన్ కార్డు వివరాలు అప్ డేట్ చేసి పాన్ కార్డ్ రీ ప్రింట్ కోసం దరఖాస్తు చేయొచ్చు.మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
పాన్ అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలన్న ఆప్షన్ ఎంచుకోండి.
ఈ-కేవైసీ, ఈ-సైన్ డిజిటల్‌గా సబ్మిట్ చేయండి.
ఈ-సైన్ ద్వారా స్కాన్ చేసిన ఇమేజెస్‌ని సబ్మిట్ చేయాలి.
పేమెంట్ పూర్తి చేసిన తర్వాత డూప్లికేట్ పాన్ కార్డు స్టేటస్ తెలుసుకోగలరు

0 Response to "పాన్ కార్డును పోగొట్టుకున్నారా..?"
Post a Comment