జాతినుద్దేశించి శనివారం ప్రసంగించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : లాక్‌డౌన్ మే 3 తో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
శనివారం ఉదయం పది గంటలకు ఆయన ప్రసంగిస్తారని కేంద్ర వర్గాలు ప్రకటించాయి.
మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తూ కేంద్ర హోంశాఖా తాజా ఉత్తర్వులు వెలువరించడంతో ప్రధాని మోదీ ప్రసంగంపై అంతటా ఆసక్తి నెలకొంది. కరోనా కట్టడికి ఏవిధమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది,
ఏయే రంగాలకు మినహాయింపులు లభిస్తాయన్నది మోదీ తన ప్రసంగంలో వెల్లడించే ఛాన్స్ ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి
0 Response to "జాతినుద్దేశించి శనివారం ప్రసంగించనున్న ప్రధాని మోదీ"
Post a Comment