ఆరోగ్య సేతు సోర్స్ కోడ్ విడుదల
న్యూఢిల్లీ మే 26: ఎట్టకేలకు
కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ అండ్రాయిడ్ సోర్స్ కోడ్‌ను
అందుబాటులోకి తెచ్చింది. ఈ కోడ్‌ను మంగళ వారం నీతిఆయోగ్ సీఈఓ అమితాబ్
కాంత్ విడుదల చేశారు. ఐఓఎస్ వెర్షన్‌ను కూడా త్వరలో
విడుదల చేస్తామని ఆయన
చెప్పారు. 100 మిలియన్ల డౌన్‌లోడ్ల తరవాత వెలువరించిన ఈ కోడ్‌ను గిట్‌హబ్
వెబ్‌సైట్ నుంచి పొందొచ్చు. ఆరోగ్య సేతు యాప్‌లోని బగ్స్, లోపాలను
గుర్తించడం,
మరింత మెరుగుపరచడానికి సూచనలు ఇచ్చేందుకు ఒక కార్యక్రమాన్ని
ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా రూ. లక్ష వరకు నగదు బహుమతులు ఇస్తామని ఆ
సంస్థ సీఈఓ అభిషేక్ సింగ్ ప్రకటించారు.
0 Response to "ఆరోగ్య సేతు సోర్స్ కోడ్ విడుదల"
Post a Comment