విద్యార్థులకు ‘నైపుణ్య పునాది
రాష్ట్రంలోని
అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులు
చేస్తున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉన్నత
విద్యామండలి అందుబాటులోకి తెస్తోంది.
వారి ఉపాధికి అవసరమైన నైపుణ్య పునాది
శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది. పరస్పర నైపుణ్యాలు, ఈ-మెయిల్
మర్యాదలు, బృంద చర్చలు, ప్రదర్శన-సాఫ్ట్ స్కిల్స్, దరఖాస్తులు-లేఖలు
రాయడం, మౌఖిక పరీక్షల ప్రదర్శన, టెలిఫోన్ సంభాషణలు, ఐటీ పునాది
నైపుణ్యాలపై ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు.
టీసీఎస్ ఐయాన్‌తో
కలిసి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. శిక్షణ పూర్తి చేస్తే డిజిటల్
సర్టిఫికెట్ అందిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి
సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
0 Response to "విద్యార్థులకు ‘నైపుణ్య పునాది"
Post a Comment