పీజీ మెడికల్‌ మెరిట్‌ జాబితా విడుదల

పీజీ మెడికల్‌ మెరిట్‌ జాబితా విడుదల



: 2020-21విద్యా సంవత్సరానికి పీజీ మెడి కల్‌ (ఎండీ/ఎంఎస్‌), డెంటల్‌ (ఎండీఎస్‌) సీట్ల ప్రవేశాలకు సంబంధించి మెరిట్‌ లిస్టును గురు వారం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. పేజీ మెడికల్‌ విభాగంలో ఆల్‌ ఇండియా నీట్‌ ర్యాంక్‌ 1620 సాధించిన ఎస్వీ యూనివర్సిటీ సర్వీస్‌ విద్యార్థి బాలాజీ కాకర్ల రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచారు.

 సర్వీసు విద్యార్థి ప్రథమ స్థానం సాధించడం విశ్వవిద్యాలయ చరి త్రలో తొలిసారి. పీజీ డెంటల్‌లో ఆల్‌ ఇండియా నీట్‌ ర్యాంక్‌ 236 వచ్చిన ఎస్వీ యూనివర్సిటీ పరి ధికి చెందిన బి.దినకర్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. పేజీ మెడికల్‌ కోర్సులకు 3886 దరఖా స్తులు రాగా 3853 మంది, ఎండీఎస్‌కు 527మంది దరఖాస్తు చేయగా 522 మంది అర్హత సాధించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పీజీ మెడికల్‌ మెరిట్‌ జాబితా విడుదల "

Post a Comment