పదో తరగతి పరీక్షలు ఎలా?

పదో తరగతి     పరీక్షలు ఎలా?

విద్యావార్షిక ప్రణాళిక ఎప్పటి నుంచి?  టీచర్ల సూచనలు తీసుకున్న మంత్రి

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షల నిర్వహణ, విద్యావార్షిక ప్రణాళిక... ఈ అంశాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సూచనలు తీసుకున్నారు.



గురువారం నచివాలయంలోని తన చాంబర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తొలుత ఆయన మాట్లాడుతూ... లాక్‌డౌన్‌ కొనసాగు తున్న తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందన్నారు.


లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేనిన రెండు వారాల తర్వాత పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందువల్ల పరీక్షల నిర్వహణతోపాటు వచ్చే అకడమిక్‌ క్యాలెండర్‌పై సంఘాలు సూచ నలు చేయాలని కోరారు.


 ఈ కాన్ఫరెన్స్‌లో ఎస్‌టీయూ, యూటీఎఫ్‌, ఏపీటీ ఎఫ్‌, హెచ్‌ ఎంఏ, ఆపస్‌, పీఆర్‌టీయూ తదితర 21 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు.



 వాటిల్లో కొన్ని. విద్యార్థులు చదివిన పాఠశాలలోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని, పరీక్షా గదుల్లో 12- 15మంది భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని, (పైవేట్‌ విద్యార్థులకు వారు చదివిన పాఠశాల దూరం ఎక్కువగా ఉంటే వారు ప్రస్తుతం ఉన్న చోటికి దగ్గర సెంటర్లో పరీక్ష రాను కునే వెసులుబాటు కల్పించాలని సూచించారు.

 జిల్లాకు 2 లేదా అంతకంటే ఎక్కువ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పాత పద్ధతిలో... పేపర్లు ఉపాధ్యాయుల ఇంటికి పంపి మూల్యాంకనం చేయించాలని అభి ప్రాయవడ్డారు.


పాస్‌ మార్కులు 30శాతానికి తగ్గించాలని, వీలైతే పదో తరగతి పరీక్షల రద్దును పరిశీలించాలని టీచర్ల సంఘాలు సూచించాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే జూన్‌ 12తర్వాత ఎప్పుడైనా అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రారంభిం చవచ్చని, పాఠశాలల పనిదినాలను 220 నుంచి 200కు తగ్గించా
 లని కోరాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పదో తరగతి పరీక్షలు ఎలా? "

Post a Comment