వెబ్ కౌన్సెలింగ్ వలన నష్టములు
:*
రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ 2015వ సంవత్సరం నవంబర్ నందు జరిగిన వెబ్ కౌన్సెలింగ్ విధానం వలన చాలా నష్టపోయి నారు. వెబ్ కౌన్సెలింగ్ వలన ఈ క్రింది నష్టములు ఉన్నవి.
*(ఇది ముఖ్యంగా SGT లకు శాపం)*
వెబ్ కౌన్సెలింగ్ వలన నష్టాలు:
*1. భార్య భర్తలు ఒకే మండలంలో లేదా ఒకే ప్రదేశంలో పనిచేసే అవకాశం లేదు.*
*2. మనకు అనుకూలంగా ఉన్న ప్లేస్ ను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాము. మన ప్రమేయం లేకుండా ప్లేసును నిర్ణయిస్తున్నారు.*
*3. లాంగ్ స్టాండింగ్ వారు వేల సంఖ్యలలో ఆప్షన్స్ ఇవ్వవలసి యుండుటవలన కన్ ఫ్యూజ్ కు గురి అవుతున్నారు. దాని ఫలితంగా చాలా మందికి 4 కేటగిరి ప్లేసులు, వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు.*
*4. మన అవసరాలకు అనుగుణంగా తగిన ప్లేసును సెలెక్ట్ చేసుకోలేము.*
*5. ఆప్షన్స్ ఎంపికలో కన్ ఫ్యూజన్ ఉంటుంది.*
*6.రోజుల తరబడి నెట్ సెంటర్ల చుట్టూ తిరగవలసి వస్తుంది.* *ఆంధ్రప్రదేశ్ లోని చాలా మంది ఉపాద్యాయులుకి కంప్యూటర్ నాలెడ్జి లేదు.* *వారికి చదువు చెప్పటంతోనే సమయం సరిపోతుంది.* *ఇక కంప్యూటర్ నాలెడ్జి ఎక్కడ నుండి వస్తుంది.* *పోనీ నెట్ సెంటర్ల మీద ఆధారపడితే ఆప్షన్స్ సరిగా ఇస్తారో లేదో తెలియదు.*
*7. నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే ఓపికలేక ఆప్షన్స్ ఇవ్వటంలో విసుగు చెంది ఆల్ అని సెలెక్ట్ చేసి 4 కేటగిరి ప్లేస్ లకు వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.*
*8. గతంలో జరిగిన వెబ్ కౌన్సెలింగ్ వలన చాలా మంది ప్లేస్ ల విషయంలో నష్టపోయారు. మనకన్నా వెనుక ర్యాంకు వారికి మంచి ప్లేసులు, ముందున్న వారికి అనుకూలంగా లేని ప్లేసులు వచ్చాయని చెప్పటం జరిగింది. అదేమని అడిగితే మీరు ఆప్షన్స్ సరిగా ఇవ్వలేదని అంటున్నారు.*
*9. మనకి అన్యాయం జరిగితే సరిచేసే అవకాశం లేదు, సరిచేసే వారు లేరు.*
*10. ఏదైనా మందలం ఆల్ అని సెలెక్ట్ చేస్తే 4 కేటగిరి ప్లేసులు రావటం వలన మరి ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినులు చాలా ఇబ్బంది పడుతున్నారు.*
*11. ప్లేసులు ఎలాట్ మెంట్లో నష్టం జరిగితే ఉపాధ్యాయ తల్లి దండ్రులకు సంబంధించిన మెడికల్ ఎమర్జెన్సీ మరియు పిల్లల చదువుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు.*
*12. .*ఆన్ లైన్ పిర్యాదులు వేదిక సక్రమం గా పనిచేయటం లో విఫలం అయ్యే ప్రమాదం ఉంది
*13. వెబ్ కౌన్సెలింగ్ మొదలైన రోజు నుండి ముగిసే వరకూ అన్ని* *రోజులు ఉపాధ్యాయులు*
*మానసికి ఆందోళనకు గురి అవుతున్నారు.* *లాంగ్ స్టాండింగ్ వారు ఆప్షన్స్ ఇవ్వాలంటే కనీసం 4 లేదా 5 రోజులు పైనే పడుతుంది.*
సాధారణ కౌన్సిలింగ్ లో బదిలీ తేది నాటి ఖాళీలను ఆప్ట్ చేసుకో వచ్చు.
వెబ్ లో
రెండో సారి ఆప్షన్ ఫైనల్ చేస్తె ఇక మార్చు కొను అవకాశమే లేదు.
స్పౌస్ దగ్గరకు బదిలి కోరుకోవాలన్న నిభందన నిర్వీయం అవుతుంది.
.
అన్ని ఆలోచించి 3 ఏల్ల తర్వాత జరుగుతున్న బదిలీలు సక్రమం గా జరగాలని కోరుకొను చున్నాము.
*అదే మామూలు కౌన్సెలింగ్ అయితే కౌన్సెలింగ్ రోజు మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది.*
**
మీరు చూపిన నష్టాలకు శాస్త్రీయత ఉందా..ఈ అంశం పై తీవ్ర చర్చ జరిగేటప్పుడు ప్రమాణత లేని ఇటువంటి అంశాలు మీ సైట్ ద్వారా టీచర్ గ్రూప్ ల లోకి పంపడం కరెక్టేనా..
ReplyDelete