ప్రయాణికులు ఇవి పాటించాలి: ద.మ.రైల్వే

హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) పలు సూచనలు చేసింది. ఈ మేరకు ద.మ.రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైలు బయలుదేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావాలని ప్రయాణికులకు సూచించింది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. 




కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణికులను ఎట్టిపరిస్థితుల్లో రైళ్లలోకి అనుమతించేది లేదని పేర్కొంది. అలాగే ఏసీ కంపార్ట్‌మెంట్లలోని ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వబోయేది లేదని తెలిపింది. ప్రయాణికులు కనీస సామాన్లతోనే ప్రయాణించాలని.. ఆరోగ్య సమస్యలున్నవారు ప్రయాణం చేయకపోవడమే మంచిదని సూచించింది. 


గర్భిణీలు, పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల వయసు దాటిన వారు ప్రయాణించొద్దని కోరింది. రైళ్లలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. రైల్వే ప్రాంగణాలు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు రైల్వే శాఖకు సహకరించాలని ద.మ.రైల్వే కోరింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రయాణికులు ఇవి పాటించాలి: ద.మ.రైల్వే"

Post a Comment