రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,461 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 9,504 మంది నమూనాలు పరీక్షించగా 131 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.


అయితే, వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 61 ఉండగా.. రాష్ట్రంలో 70 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,461కి కేసులు నమోదయ్యాయి. 



కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 2092 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,461 కేసులు"

Post a Comment