దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్‌డౌన్
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్-30 వరకు లాక్ డౌన్ పొడిగించింది. ఈ
మేరకు కొత్త మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. జూన్ 8 నుంచి
ప్రార్థనామందిరాలు, హోటళ్లు, మాల్స్ ప్రారంభం కానున్నాయి. రాష్ట్రాలతో
చర్చించిన తర్వాతే స్కూళ్లు,
కాలేజీలకు అనుమతిస్తామని కేంద్రం తెలిపింది.
కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్ మరింత కఠినతరం చేస్తామని కేంద్రం
ప్రకటించింది. ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమల్లో
ఉంటుందని తెలిపింది.
కాగా.. అంతర్జాతీయ ప్రయాణాలు, సినిమా హాళ్లు, జిమ్‌లు,
స్విమ్మింగ్‌పూల్స్‌పై ఫేజ్-3లో కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. కట్టడి
ప్రాంతాల్లో అత్యవసర సేవలకే మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం
చేసింది

0 Response to " దేశవ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్‌డౌన్"
Post a Comment